ఆలేరు టౌన్, జూన్ 12, : ఆలేరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వ్యాపారవేత్త సముద్రాల కుమార్ సతీమణి రాములమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇటీవల ఇంటికి వచ్చింది. విషయం తెలిసిన ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్, ఉపాధ్యక్షుడు బింగి రవి, పంతం కృష్ణ, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, ఏసి రెడ్డి మహేందర్ రెడ్డి, ఎండీ ఫయాజ్, కటకం బాలరాజ్, బాసని ప్రశాంత్ పాల్గొన్నారు.