రాజాపేట, ఆగస్టు 20 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు పూర్తిస్థాయిలో నుండి అలుగు పోస్తుంది. చెరువు అలుగు పోస్తుండడంతో బేగంపేట, పొట్టిమర్రి వరద నీటితో ప్రవహిస్తుడంతో వాగులో నిర్మించిన చెక్ డ్యాంలకు జలకల సంతరించుకుంది. రాజపేట మండలంతో పాటు యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, ఆత్మకూర్, మోత్కూర్ మండలాలకు భూగర్భ జలాలు పెరిగి వరి సాగు విస్తీర్ణం పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.