బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఐదుగురు రిమండ్
అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో...
మోత్కూరు, నవంబర్ 18 : అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో పని చేస్తున్న కాంట్రాక్టర్ వంట మనిషి శ్రీరాముల వెంకన్న(55) (స్వస్థలం తూర్పుగూడెం గ్రామం, తుంగతుర్తి మండలం, జిల్లా సూర్యాపేట) విద్యార్తినిలతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించాడని విద్యార్ధిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అడ్డగూడూరు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ రోజు అడ్డగూడూరు పోలీసులు ప్రధాన నిందితుడిని మునగనూరు, హైదరాబాద్లో అక్క ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
అదే విధంగా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ, మెస్ అటెండర్ పూలమ్మ, మెస్ కాంట్రాక్టర్ మధు అలాగే సోమన్న ను కూడా అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టులో హాజరు పరిచారు. కేసును అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణ చేయగా డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ రవి, వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్ సహకారంతో అడ్డగూడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఐదుగురు విద్యార్థినులు బాధితులుగా ఉన్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. ప్రధాన నిందితున్ని అరెస్ట్ చేయడమే కాకుండా కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసినందుకు అడ్డగూడూరు పోలీసులను అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ అభినందించి వారికి క్యాష్ రివార్డులను ప్రదానం చేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం..మరొకరికి తీవ్రగాయాలు
బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఐదుగురు రిమండ్
Hormones | పండుగల అనంతరం హార్మోన్లలో మార్పులు వస్తాయా.. ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలి..?
‘ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలి’
Rapthadu accused | ఆసుపత్రి నుంచి రాప్తాడు నిందితుడు డిశ్చార్జ్ ..అనంతపురం జిల్లా జైలుకు తరలింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

