భూదాన్ పోచంపల్లి, మార్చి 22 : విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల యువజన సంఘం ( పి వై ఎల్ ) రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మామిడాల ప్రవీణ్, సిద్దేశ్వర్ తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ప్రగతిశీల యువజన సంఘం, పీడీఎస్యూ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే భగత్ సింగ్ వర్ధంతి పోస్టర్ను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 29న భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు అందరూ హాజరుకావాలని కోరారు. బీజేపీ మతోన్మాద పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ ఎల్ జిల్లా కోశాధికారి పగడాల శివ, జిల్లా నాయకులు ఎలగందుల సిద్ధులు, పోతగల నరసింహ, గోరుగంటి ముత్యాలు పాల్గొన్నారు.