రాజాపేట, జూన్ 11 : రాజాపేట మండలం పారుపల్లిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో పప్పు జాతి పశుగ్రాసాల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పప్పు జాతి పశుగ్రాసాల రకాలు, మేలైన విత్తనాలు వాటిని ఏ విధంగా సాగు చేయాలో వివరించారు. పశువులకు, జీవాలకు వాటిని వినియోగిస్తూ ఏ విధంగా పచ్చిమేత, ఎండుమేతతో పాటు దాణా ఖర్చు తగ్గించుకోవచ్చో అవగాహన కల్పించారు. అదేవిధంగా గడ్డి కత్తిరించే యంత్రాల చాప్ కట్టర్ వినియోగంపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి చంద్రారెడ్డి, రఘునాధపురం పశువైద్యాధికారి భాస్కర్, రైతులు పాల్గొన్నారు.