బీబీనగర్, జూలై 4 : బీబీనగర్ మండల పరిధిలో పడమటి సోమారం గ్రామంలో గల శ్రీ లింగ బసవేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి సన్నిదానం నిర్మాణానికి మండల రైతు బంధు సమితి మండల మాజీ కో ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని శుక్రవారం సన్నిదానం కమిటీ సభ్యులకు అందజేశారు. కమిటీ సభ్యులు దాతను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుడు వాకిటి అంజిరెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ తలబోయిన జంగయ్యయాదవ్, బీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్, నాయకులు మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, తలారి గణేశ్, ఎ్రరబోతు భాస్కర్, భాస్కర్ రెడ్డి, వాకిటి ఉపేందర్‌రెడ్డి, ఆల్వా సురేందర్ రెడ్డి, భిక్షపతి, బలరాం, మల్లారెడ్డి పాల్గొన్నారు.