రాజాపేట, ఏప్రిల్ 03 : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య ఫ్లెక్సీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు కొమురయ్య అని కీర్తించారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే రాజాపేటలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగు సిద్ధులు, చిగుళ్ల లింగం, బైరా పాండు, బోడపట్ల అశోక్, రేగు కనకయ్య, ములుగు సోమలింగం గుప్తా, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.