మోత్కూరు, ఆగస్టు 11 : కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూరు మండలాన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయంలో ఏ.ఎస్.ఓ. కృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టే నియోజకవర్గ పునర్విభజనలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకు అదనంగా 34 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. యాదాద్రి జిల్లాలో అంత్యంత్ వెనుకబడిన మండలంగా మోత్కూరు ఉందన్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న నియోజకవర్గ పునర్విభజనలో గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూరు (ఎం), మోటకొండూరు మండలాలకు అనుసంధానంగా ఉన్న మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ 5మండలాల్లో 68 రెవెన్యూ గ్రామాలు, 90 గ్రామ పంచాయతీలతో పాటు 2011 జనాభా లెక్క ప్రకారం 1.73 (ఒక కోటి 73 లక్షలు) జనాభా ఉందన్నారు. ఈ 14 సంవత్సరాలు జనాభా లెక్క పరిశీలిస్తే మరో 50 వేలు పెరగవచ్చన్నారు. మోత్కూరు నియోజవర్గం ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, మండల అధ్యక్షుడు శివార్ల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్యగిరి, స్థానిక నాయకులు లింగంపల్లి రఘువర్ధ న్ రావు, ఎడ్ల నరేందర్, గొలుసుల శ్రీనివాస్, రేవల్లి రవిప్రసాద్, కోల మహేశ్, కొయ్యలకారి జహంగీర్, గొలుసుల కొండయ్య, కురిమేటి యాదయ్య, మహ్మద్ రఫీ, లక్ష్మీ, ధనమ్మ, బీసు మధు, తొగిటి మనోహరాచారి, వెంకన్న పాల్గొన్నారు.