భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 16 : కెనరా బ్యాంక్ పోచంపల్లి శాఖలో సర్వర్ డౌన్‌తో కంప్యూటర్లు పనిచేయక పోవడంతో మంగళవారం వినియోగదారులు బ్యాంక్ ఎదుట, ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. శుక్రవారం నుండి మంగళవారం వరకు సర్వర్ డౌన్‌తో బ్యాంక్ సేవలు నిలిచిపోవడంతో రైతులు, మహిళలు, వ్యాపారులు బ్యాంక్‌కు వచ్చి నిరీక్షిస్తున్నారు. డబ్బులు ఇవ్వక పోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో సరైన స్టాప్ లేకపోవడంతో పనులు జరగడం లేదని, మహిళా సంఘాలు లోన్ తీసుకున్న డబ్బులు జమ చేసుకోవడం లేదని, సకాలంలో లోన్లు కట్టకపోతే వడ్డీ వేస్తారని, బ్యాంక్ మేనేజర్ పట్టించుకోలేదని ఆవేదన చేశారు. బ్యాంక్‌లో స్టాఫ్‌ను పెంచి వినియోగదారులకు సేవలందించాలని కోరారు. బ్యాంక్ మేనేజర్ రాఘవేందర్ మాట్లాడుతూ.. శుక్రవారం నుండి బ్యాంక్‌లో సర్వర్ డౌన్‌తో కంప్యూటర్లు పనిచేయడం లేదని, మధ్యాహ్నం మూడు గంటల వరకు సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.