చౌటుప్పల్, జులై 05 : రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సహకార సంఘాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆ సంఘ భవనంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు రైతులకు కల్పిస్తున్న వివిధ రాయితీలను వివరించారు. ఈ కార్యక్రమంలో పీఐసీ మెంబర్ చెన్నగోని అంజయ్యగౌడ్, సంఘ సభ్యులు పి.వెంకట్‌రెడ్డి, సిహెచ్ శివకృష్ణా, బద్దం శ్రీనివాస్‌రెడ్డి, తొర్పునూరి నర్సింహ్మ, సీఓ వై.రమేశ్, సిబ్బంది వినోద్, మహిపాల్‌రెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.