చౌటుప్పల్లో భవన నిర్మాణ కార్మికుల నిరసన ర్యాలీ
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల భవన నిర్మాణ కార్మికుల సమ్మె మంగళవారం 4వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక పట్టణ కేంద్రంలోని హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకు వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
చౌటుప్పల్, జూన్ 09 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల భవన నిర్మాణ కార్మికుల సమ్మె మంగళవారం 4వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక పట్టణ కేంద్రంలోని హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకు వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. 55 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి రూ.5 వేల రూపాయలు పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికులకి ఈఎస్ఐ కార్డు సదుపాయం కల్పించాలన్నారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణించినచో రూ.20 లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలన్నారు. సంక్షేమ బోర్డు కార్డు ఉన్న ప్రతి కార్మికుడు సహజ మరణం పొందితే వారికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.
కార్మికుల ఇంట్లో కుమార్తె వివాహానికి రూ.లక్ష అందించాలన్నారు. ప్రసూతి సమయంలో రూ.60 వేలు చెల్లించాలన్నారు. సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణను ఎత్తివేసి ప్రభుత్వమే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు బొల్లమోని రాములు, నరసింహ, సుక్క యాదయ్య, ఎర్నం శ్రీనివాస్, నెలికంటి నరసింహ, కలకుంట్ల శివకుమార్, వెంకటయ్య చీమ కండ్ల శ్రీరాములు, మడారి మార్క్, సదానందం, నరసింహ, శ్రీను, జువ్వి యాదయ్య, లింగస్వామి, రేఖ మల్లయ్య, ఉబ్బు యాదయ్య, జాజుల భిక్షపతి, గజ్జల రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

