ఆలేరు టౌన్, ఆగస్టు 23 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఆలేరు మండల మండల అధ్యక్షుడు పూజారి కుమార్ స్వామి గౌడ్ తో కలిసి శనివారం ఎమ్మార్వో ఆంజనేయులుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొలనుపాక గ్రామంలోని వాగుపై బ్రిడ్జి, గుండ్లగూడ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జిని నిర్మించాలన్నారు. రైతులకు పంట రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలన్నారు. కెనాల్ కాల్వ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించక పోవడం వల్ల గ్రామాల్లో పాలన కుంటుపడిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎరువులను సరఫరా చేస్తున్నా వాటిని బ్లాక్ మార్కెట్ కు తరలించడం వల్ల ఎరువుల కొరత ఏర్పడిందని ధ్వజమెత్తారు. అంతకుముందు కొలనుపాక గ్రామంలో యువకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ భోగ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిలు అంకిరెడ్డి శ్రీనివాస్, శేషత్వం అమరేందర్ రెడ్డి, వెంకటేశ్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తీరాల శంకర్, నాయకులు బైరి మహేందర్ గౌడ్, రాజు, కట్ట అమరేందర్ రెడ్డి, గడ్డం సందీప్, పరశురాములు, శివ, పృథ్వీ, సంతోశ్, రాజిరెడ్డి పాల్గొన్నారు.