చల్లూరులో అక్రమ క్రషర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టల్లో 322 సర్వే నెంబర్లలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌తో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించి అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు..
రాజాపేట, ఏప్రిల్ 20 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టల్లో 322 సర్వే నెంబర్లలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌తో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించి అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్, కర్రె వెంకటయ్యతో పాటు నియోజకవర్గ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే అధికార దాహంతో కొంతమంది నాయకులు పకృతి సంపదని కొల్లగొడుతూ కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రేయింబవళ్లు అక్రమ బ్లాస్టింగ్ పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న చప్పుళ్లకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ మైనింగ్ దందా వెనక ఇంత పెద్దోళ్లు ఉన్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలించి కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి చామకూర గోపాల్ గౌడ్, నాయకులు గుంటి కృష్ణ, ఎర్ర గోగుల జస్వంత్, నాగిర్తి గోపిరెడ్డి, బొంగోని ఉప్పలయ్య గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, గోపగాని రామిండ్ల నరేందర్, యమ్మ భాస్కర్, ఎడ్ల నరేష్ రెడ్డి, చెరుకు కనకయ్య, సోమలింగం గుప్తా, వరుణ్ రమేష్, యమ్మ ఎల్లయ్య, తుంగ అక్షయ్ కుమార్, తుంగ వేణు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

