ఆత్మకూరు (ఎం), మే 28 : తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీజేఎఫ్ వ్యవస్థాపకుడు అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 31 హైదరాబాద్ జల విహార్‌లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ఆత్మకూర్ (ఎం) మండలం నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీయూడబ్ల్యూజే (H-143) మండలాధ్యక్షుడ ఎలిమినేటి నగేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రేగోటి పాండురంగం పిలుపునిచ్చారు.
బుధవారం మండల కేంద్రంలో తాసీల్దార్ లావణ్య, డిప్యూటీ తాసీల్దార్ సఫియుద్దీన్, ఆర్ఐ మల్లికార్జునరావు, యూనియన్ నాయకులతో కలిసి రజతోత్సవ సభ ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు మల్లేశ్, లోడి భాస్కర్, కాడిగళ్ల వెంకటేశ్, గాడిపల్లి ఉదయ్‌కుమార్, మామిడి ఇంద్రారెడ్డి, బబ్బూరి శివలింగం పాల్గొన్నారు.