వలిగొండ, మే 30 : వలిగొండ మండలంలోని కేర్చిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దెల మంజుల అన్నారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ మహిళలతో కలిసి యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామానికి బస్సు సౌకర్యం లేక వివిధ రకాల పనుల మీద జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి ప్రయాణికులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల ప్రయాణ సమస్యలను పరిష్కరించడం కోసం బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.