భూదాన్ పోచంపల్లి, జులై 02 : భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ( కొంగరి భాస్కర్ ఆడిటోరియం) లో నిజాం కళాశాల ప్రొఫెసర్ తడక యాదగిరి సంక్షిప్తంగా రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎండీ రియాజ్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానత్వం చేకూరాలన్నారు. జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించాలని, ప్రతి ఒక్కరి సమానత్వం కోసం రాజ్యాంగం రూపొందించడం జరిగిందన్నారు. ప్రజలు మాత్రమే సర్వాధికారులని, ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి భారత రాజ్యాంగాన్ని సంక్షిప్తంగా అనువాదం చేశారని, మన రాజ్యాంగ స్ఫూర్తిని దశ దిశల వ్యాప్తం చేసేందుకు ఇంటింటా రాజ్యాంగ కార్యక్రమాన్ని ఈ సంవత్సరమంతా నిర్వహించాలన్నారు.
600 పుస్తకాలను అందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ఏర్పాటు చేస్తానని తెలిపారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని సంక్షిప్తంగా రూపొందించడం పట్ల తడక యాదగిరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత నాయకులు తడక వెంకటేశ్, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, బ్యాంక్ సీఈఓ సీత శ్రీనివాస్, బ్యాంక్ డైరెక్టర్లు ఏలే హరిశంకర్, రాపోలు వేణు, మక్తల నరసింహ, కొండమడుగు ఎల్ల స్వామి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, నాయకులు చిoతకింది రమేశ్, గునిగంటి రమేశ్ గౌడ్, భోగ విష్ణు, అంకం మురళి, ఏలే భిక్షపతి, రాపోలు శ్రీను, పాలాది యాదగిరి, భారత భూషణ్, బొమ్మ హరిశంకర్, వలందాస్ ప్రవీణ్, భోగ నరసింహ పాల్గొన్నారు.