భువనగిరి అర్బన్: పట్టణంలోని అర్బన్ కాలనీ, తాతానగర్‌లో భోనాల పండగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. అర్బన్ కాలనీలో జరిగిన భోనాల పండగకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరై పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కౌన్సిలర్లు కుశంగల ఎల్లమ్మ, కడారి ఉమాదేవి , నజీయారహమాన్ జహాంగీర్, నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.