భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆంధ్రాను మించిపోతుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నా రు. టీఆర్ఎస్ భువనగిరి పట్టణ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ పంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించారు.
అంతకుముందు టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సాయిబాబా గుడి నుంచి ప్రారంభ మైన బైక్ ర్యాలీ వినాయక చౌరస్తా, జగదేవ్‌పూర్ చౌరస్తా, హైదరాబాద్ చౌరస్తా నుంచి రాంనగర్ చౌరస్తా మీదుగా పంక్షన్ హాల్‌కు చేరుకుంది. ర్యాలీ సందర్భంగా అంబేద్కర్, జ్యోతిబాఫులే విగ్రహాలకు, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేశారు.
సమావేశంలో ముందుగా పట్టణ కమిటీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని గజమాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఏడారిగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ కోనసీమగా మార్చుతున్నాడని అన్నారు.
ఒకే దఫాలో పార్టీ అధికారంలోకి రావడం, రాష్ట్రం ఏర్పడడం, జిల్లాలుగా మార్చడం, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం, రాష్ర్టాన్ని దేశంలో పథకాలు ప్రవేశపెట్టడంతో మొదటి స్థానంలో నిలబెట్టడంతో చరిత్రను తిరగరాసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు.
బంగారు తెలంగాణ కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాత్రమే సాధ్య పడుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు భువ నగిరిలో బతుకమ్మలను వేయడానికి కవర్లను ఏర్పాటు చేసి ట్యాంకర్లతో నీటిని పోసి వదిలామని, రాష్ట్రం ఏర్పడిన తర్వా త కాళేశ్వరం నీటితో భువనగిరితో పాటు నియోజకవర్గంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయని అన్నారు.
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్య పడుతుందన్నారు. తెలంగాణలో అభివృద్ధి, పేద ప్రజల కష్టాలు తీర్చడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ కుటుంబ సభ్యులని వారిని కాపాడుకునే భాద్యత పార్టీకి ఉందన్నారు.
రానున్న రోజుల్లో భువనగిరి నియోజకవర్గంలోని పట్టణ, గ్రామాలను మోడల్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు. భువనగిరి పెద్ద చెరువును మిని ట్యాంక్ బండ్, జూనియర్ కళాశాలలో మినీ స్టేడియం, టౌన్‌హాల్ ఏర్పాటుతో పాటు పట్టణాన్ని గొప్పనగరంగా మార్చుతానని అన్నారు.
గ్రామాలు, పట్టణా లు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్య పడుతుందన్నారు. రెండు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ, అండర్‌గ్రౌండ్ డ్రేనేజీతో ప్రజా సమస్యలు లేకుండా చేస్తానని చెప్పారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చాయి, ఎంత మంది లబ్ధిపొందారు, అర్వులైన వారు అందుకోలేక పోతున్నారా, లోపం ఎక్కడ ఉంది అనే విషయాలను కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పర్యవేక్షించి సరైన న్యాయం జరిగేలా చూడాలన్నారు.
ప్రభుత్వం అందజేసు ్తన్న పథకాలు పార్టీలకతీతంగా అందేలా చూడాలని కమిటీ సభ్యులకు సూచించారు. నవంబర్ 15న జరిగే విజయగర్జన సభకు ప్రతి వార్డు నుంచి రెండు బస్సులు తరలివెళ్లాలని తెలిపారు. సభ విజయవంతం చేయాల్సిన భాద్యత ప్రతి కార్యకర్తపై ఉందని చెప్పారు.