భువనగిరి కలెక్టరేట్ : ఈ నెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని గురువారం కలెక్టర్ పమేలాసత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని కలియ తిరిగారు. ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పనులను పూర్తి స్థాయిలో కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట ఆర్ఆండ్బి ఇంజినీరింగ్ అండ్చీఫ్ గణపతి, డీఎఫ్ఓ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.