మోటకొండూర్, అక్టోబర్ 08 : చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది చిన్న అలవాటు అయినా, ఆరోగ్య పరిరక్షణలో అత్యంత ముఖ్యమైనదని, పిల్లలకు చిన్న వయసులోనే పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి అన్నారు. మోటకొండూర్ మండలంలోని అమ్మనబోలు అంగన్వాడీ కేంద్రాలు 1, 2, 3లలో పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా బుధవారం హ్యాండ్ వాష్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషణ్ మహా ద్వారా గ్రామీణ స్థాయిలో పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సిద్దమ్మ, భాగ్యలక్ష్మి, వసంత పాల్గొన్నారు.