భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 31 : భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతకు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్.కిశోర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థలో మూడు నెలల కాల పరిమితితో కూడిన డాటా ఎంట్రీ ఆపరేటర్ డిజిటల్ మిత్ర (ఇంటర్ పాస్), ట్యాలీ (బీకాం పాస్ ), ఆటోమొబైల్ (ఎస్ఎస్సి పాస్), ఆరు నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రీషన్, సోలార్ ఇన్స్టాలేషన్ (ఐటిఐ పాస్), కంప్యూటర్ హార్డ్వేర్, సీసీటీవీ, సెల్ ఫోన్ రిపేరింగ్ (ఎస్ఎస్సీ పాస్), టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి, క్విల్డ్ మేకింగ్ (8వ తరగతి పాస్) కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉచిత భోజన, వసతితో పాటు శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పించబడునని తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, క్యాస్ట్, పాస్ ఫొటోలతో జనవరి 5న నిర్వహించే కౌన్సిలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు. వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్లకు ఫొన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు.