మోత్కూరు: మోత్కూరు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫి కేషన్ జారీ చేసినట్లు సీడీపీవో జ్యోత్స్న తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు(ఎం) మండల పరిధిలోని తిమ్మాపురం, పల్లెర్ల-3 అంగన్వాడీ కేంద్రాల టీచర్ల పోస్టులకు (ఎస్సీ రిజర్వు), గుండాల మండలంలోని సీతారాంపురం-3 అంగన్వాడీ పోస్టుకు (వికలాంగులకు రిజర్వు), మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ని సాయిబాబ కాలనీలో అంగన్వాడీ కేంద్రం ఆయా పోస్టుకు(ఎస్సీ రిజర్వు), మోత్కూరు మండలంలోని పాటిమట్ల అంగన్వాడీ ఆయా పోస్టు జనరల్‌కు, అడ్డగూడూరు మండలంలోని వెల్దేవి అంగన్వాడీ కేంద్రం అయా పోస్టు (బీసీ-సీ),
ఆత్మకూరు(ఎం) మండలంలోని తుక్కాపురం అంగన్వాడీ కేంద్రం ఆయా పోస్టుకు జనరల్ (రిజర్వు) గుండాల మండలం లోని తుర్కలశాపురం అంగన్వాడీ కేంద్రం -1 ఆయా పోస్టు (జనరల్), వంగాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆయా పోస్టు ఎస్సీలకు, బుర్జుబావి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం జనరల్‌కు రిజర్వు చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకొను అర్హత కలిగిన అభ్యర్థులు 1 జులై, 2021 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు వారు అవసరమైన దృవీకరణ పత్రాలను స్కానింగ్ చేసి http://wdcw.tg.nic.in??? http:mis.tgwdcw.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకొని, ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అవసరమైన దృవీకరణ పత్రాలను ఈ నెల 25వ తేదీ లోపు మోత్కూరులోని తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. వివరాలకు కార్యాలయం సమయాల్లో సంప్రదించాలని సూచించారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
ఆలేరు టౌన్ : ఆలేరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశామని సీడీపీవో చంద్రకళ తెలిపారు. సోమవారం ఐసీడీఎస్ కార్యాల యంలో ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు- 3, మినీ అంగన్వాడీ టీచర్-1, ఆయాలు-14, ఖాళీలను భర్తీ చేసేందుకు గాను అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ నెల16 నుంచి 25 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. 10వ తరగతి పాస్ అయి ఉండాలని దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
తేదీ 01-07-2021 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలని, అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఆ ఊరి నివాసురాలై ఉండాలని, దరఖాస్తు చేసుకోవాలంటే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, కులం, ఎస్ఎస్సీ మార్కుల జాబితా, నివాస స్థలం ధ్రువీకరణ పత్రం, వితంతువైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అనాథ అయితే ఆనాథ ధ్రువీకరణ పత్రం, వికలాంగులైతే సదరం మెడికల్ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలన్నారు. వివరాలకు 7780335145 గల సెల్ నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.