Bibinagar | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పట్టణంలోని పోచంపల్లి రోడ్డు చౌరస్తా వద్ద.. అటువైపుగా వెళ్తున్న ఎయిమ్స్ నర్సింగ్ అధికారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనతో అప్రమత్తమైన స్థానికులు దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
అనంతరం దుండగుడిని బీబీనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం భయానకంగా మారింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.