
బీబీనగర్, ఆగస్టు 23 : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండా రూ.15లక్షలు, గుర్రాలదండి రూ.15లక్షలు, నీలతండా రూ.15లక్షలు, జంపల్లి రూ.15లక్షల వ్యయంతో హెచ్ఎండీఏ ద్వారా మంజూరైన నిధులతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల వివిధ గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన 21మందికి ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2,52,000/- చెక్కులను 9 మంది లబ్ధిదారుల కుటుంబసభ్యులకు అందజేశారు. అనంతరం గుర్రాలదండి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను గ్రామశాఖ అధ్యక్షుడు ధరావత్ భిక్షపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖస్థాయీ సంఘం చైర్మన్ జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, సర్పంచులు బర్మావత్ బుచ్చాలు, బానోతు లాలు, నునావత్ శ్రీనివాస్, దంతూరి బాలరాజు, ఎంపీటీసీ ముడావత్ వాణీవీరూనాయక్, నాయకులు కొలను దేవేందర్‌రెడ్డి, ఎండీ అక్బర్, టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్ పాల్గొన్నారు.