యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటు పరం!
తెలంగాణ ఆవిర్భావ సమయంలో విద్యుత్తు సమస్యతో సతమతమవుతున్న రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్లాంటును ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముం దుగా ప్లాంటులోని కోల్, యాష్ ప్లాంట్లు ప్రైవేట్ పరం చేసి అనంతరం మిగతా ప్లాంటును ప్రైవేటుకు కట్టబెట్టే యోచనలో సర్కార్ ఉంది.
- కేసీఆర్ కలల ప్రాజెక్టును ఆగం పట్టిస్తున్న రేవంత్ సర్కార్
- ఉద్యోగుల కొరత సాకుతో టెండర్ కాల్చేసిన జెన్కో
- ప్రస్తుతానికి ప్లాంటులోని కోల్, యాష్ ప్లాంట్లు ప్రైవేటీకరణ
- ప్రభుత్వ యోచనను నిరసిస్తూ స్థానికుల ఆందోళన
తెలంగాణ ఆవిర్భావ సమయంలో విద్యుత్తు సమస్యతో సతమతమవుతున్న రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్లాంటును ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముం దుగా ప్లాంటులోని కోల్, యాష్ ప్లాంట్లు ప్రైవేట్ పరం చేసి అనంతరం మిగతా ప్లాంటును ప్రైవేటుకు కట్టబెట్టే యోచనలో సర్కార్ ఉంది. నాడు కేసీఆర్ పవర్ ప్లాం టును రూ.35వేల కోట్లతో ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశారు.
అధికార మార్పిడి అనంతరం ప్లాంటులోని నాలుగు యూనిట్లలో మిగిలిపోయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రస్తుతం ప్లాంటులోని నాలుగు యూనిట్ల ద్వారా రాష్ర్టానికి 3200 యూనిట్ల (ఒక్కో యూనిట్ ద్వారా 800 మెగావాట్లు) విద్యుత్తు అందుతోంది. ఐదో యూనిట్ పనులు పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ర్టానికి యాదాద్రి పవర్ ప్లాంటే పెద్ద దిక్కు. దేశంలోనే పెద్ద పవర్ ప్లాంట్ అయిన యాదాద్రి ప్లాం టును ప్రవేటు పరం చేయాలనే యోచన సరికాదం టూ స్థానికులు,ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
దామరచర్ల, జూన్ 11: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగుల కొరతను సాకుగా చూపుతూ ప్లాంటులోని స్టేజ్-1 స్టేజ్-2 యూనిట్లకు సంబంధించిన కోల్ ప్లాంట్, యాష్ ప్లాంట్ల ఆపరేషన్, మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులకు 3 సంవత్సరాలకు గానూ టీజీ జెన్కో టెండర్ కాల్ చేసింది. ఎస్టిమేషన్ కాంట్రాక్టు విలువ రూ.250 కోట్లుగా టీజీ జెన్కో పేర్కొంది.
టెండర్లు వేసేందుకు గడువు ఈనెల 12 కాగా.. చివరి తేదీ ఈ నెల 29గా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్తు సమస్యతో సతమతమవుతున్న తెలంగాణాను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నాటి సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలని చూడటం శోచనీయం. ఇటీవల సింక్రనైజ్ చేసిన ఐదో యూనిట్లో అగ్నిప్రమాదం జరిగి విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ యూ నిట్ పనులు కూడా పూర్తిచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ర్టానికి ఈ ప్లాంటే ఆధారం. దేశంలోనే పెద్ద పవర్ ప్లాంటు అయిన ఈ ప్లాంటును ప్రైవేటు పరం చేయాలనే యోచనను స్థానికులు, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
ఉద్యోగుల కొరత సాకుతో..
పవర్ ప్లాంటులోని నాలుగు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ అందుకు అవసరమయ్యే ఉద్యోగులను నియమించడం లేదు. 2020లో పాల్వంచ నుంచి 400 మంది, గతేడాది రామగుండం నుంచి సుమారు 70 మం దిని ఇక్కడ పనిచేసేందుకు బదిలీపై పంపించారు. వీరితో పాటు స్థానికులైన 445 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వీరితోపాటుగా అదనంగా మరో 800 మంది ఉద్యోగుల అవసరం ఉంది. ఉద్యోగుల కొరత కారణంగా యాష్, కోల్ ప్లాం ట్లను కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు జెన్కో టెండర్ వేసిం ది.
పవర్‌ప్లాంటు ఏర్పాటు సమయంలో పరిసర గ్రామాలకు భూ నిర్వాతులకు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీరిలో 333 భూ నిర్వాసితులను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నది. పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న మరో 67 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఎంక్రోచర్స్ 440 మం ది ఉన్నారు. ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లోని అనేక మంది యువకులు బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్లాంటులో ఉద్యోగుల అవసరం ఉన్నా స్థానికులకు అవకాశం కల్పించడం లేదని యువకులు, నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఉద్యోగాలను భర్తీ చేయకుండా మరో పక్క ఉద్యోగుల కొరత అంటూ ప్రైవేటు పరం చేయడంపై స్థానిక యువకులు మండి పడుతున్నారు.
ప్లాంటు వద్ద.. స్థానికుల ఆందోళన
యాదాద్రి పవర్ ప్లాంటును ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం యోచించడంతో గురువారం స్థానికులు ప్లాంటు వద్ద ఆందోళన చేపట్టారు. ప్లాంటును నమ్ముకొని ప్రభావిత గ్రామాల యువకులు కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్నారని, గత ప్రభుత్వం ప్రభావిత గ్రామా ల ప్రజలకు అన్ని విధాల న్యాయం చేస్తామని, స్థానికులైన 2వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా మేరకే ప్లాంటు నిర్మాణానికి అనుకూలంగా తీర్మానాలు చేసి సహకరించామని, ఈ ప్రభు త్వం ఉద్యోగాలు కల్పించ కుండా ప్రైవేటు పరం చేయ డం దారుణమన్నారు. ప్రస్తుతం యాష్, కోల్ ప్లాంట్లతో మొదలై చివరకు మొత్తం ప్లాంట్‌నే ప్రవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. దీని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీ కరణను వ్యతిరేకిస్తూ పాల్వంచలోని కేటీపీఎస్‌లో జెన్కో ఇంజినీర్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

