నేర రహిత సమాజానికి కృషి చేయాలి
ప్రజలంతా చట్టాలపై అవగాహన పెంచుకుని నేర రహిత సమాజానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బాలభాస్కర్రావు సూచించారు.
భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 6 : ప్రజలంతా చట్టాలపై అవగాహన పెంచుకుని నేర రహిత సమాజానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బాలభాస్కర్రావు సూచించారు. మండలంలోని అనంతారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చట్టాలపై, న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, పిల్లలతో పనులు చేయిస్తే చట్ట ప్రకారం రూ.లక్ష జరిమానా, రెండేండ్ల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. భూ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం-2007 ప్రకారం తల్లిదండ్రుల బాగోగులు పిల్లలు తప్పనిసరిగా చూడాలని కోరారు. న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం చట్టాలపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పారా లీగల్ వాలంటీర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం మల్లికార్జున్, రూరల్ ఎస్ఐ రాఘవేందర్, ఎంపీటీసీ సామల వెంకటేశ్, ఉపసర్పంచ్ విఠల్ వెంకటేశ్, కార్యదర్శి నర్సింగ్రావు, ప్యానల్ అడ్వకేట్ శంకర్, పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేశ్, కానుగంటి శ్రీశైలం, బాలేశ్వర్, మండల న్యాయ సేవాధికార సంస్థ బాధ్యులు నర్సింహారావు, వార్డుసభ్యులు, వీబీకే పద్మ, అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి, సూపర్వైజర్లు మహిళలు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

