మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర షురూ
మునుగోడు విజయంతో దేశంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) జైత్రయాత్ర మొదలైందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 6 : మునుగోడు విజయంతో దేశంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) జైత్రయాత్ర మొదలైందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీ రామరక్ష అని, ప్రజలంతా నమ్మి ఆయనకు అన్ని విధాలుగా వెన్నంటి ఉంటున్నారని.. ఇదే మంత్రాన్ని మునుగోడు ప్రజలు సైతం నమ్మి తీర్పు ఇచ్చారని వివరించారు. టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర వహించిన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు, వామపక్షాలు, పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. తమ విచక్షణతో తెలివైన నిర్ణయం తీసుకున్న మునుగోడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది బీజేపీ పై బీఆర్ఎస్ సాధించిన తొలివిజయంగా పరిగణించాలని పేర్కొన్నారు. తెలంగాణలో కుట్రలు చెల్లవని ప్రజలు బీజేపీకి చెంపచెల్లుమనిపించారని తెలిపారు. ఈ విజయం తెలంగాణ ఆత్మ గౌరవ విజయమని ఇది పూర్తిగా సీఎం కేసీఆర్ విజయం అని తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

