బీఆర్ఏఓయూలో గుణాత్మక విద్య
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిర్సిటీ మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైనచ గుణాత్మక విద్య అందిస్తున్నదని బీఆర్ఏఓయూ వీసీ ప్రొఫెసర్ కె.సీతారామారావు సూచించారు.
- వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీతారామారావు
రామగిరి, నవంబర్ 6: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిర్సిటీ మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైనచ గుణాత్మక విద్య అందిస్తున్నదని బీఆర్ఏఓయూ వీసీ ప్రొఫెసర్ కె.సీతారామారావు సూచించారు. నల్లగొండలోని ఆ యూనివర్సిటీ లెర్నర్ సపోర్ట్ సర్వీస్ సెంటర్( రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్)లో 2022-23 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యలో చాలా చైతన్యవంతమైన జిల్లా నల్లగొండ అన్నారు. యూ నివర్సిటీ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో అడ్మిషన్లలో నల్లగొండ అగ్రస్థ్ధానం లో ఉండటం ఆనందంగా ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక అంశాలతో బీఆర్ఏఓయూ సైతం విద్యార్థులకు ఐసీటీతో విద్యాబోధన సాగిస్తూ విద్యరంగంలో సములమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు. నల్లగొండ సర్వీస్ సెంటర్లోనే ఇప్పటి వరకు యూజీ కోర్సుల్లో 810, పీజీ కోర్సుల్లో 71 0మంది అభ్యర్థులు చేరారని తెలిపారు. కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. జీవితంలో స్థిరపడడానికి అవసరమైన పలు రకాల డిప్లొమో కోర్సులు సైతం అందించి ఉద్యోగావకాశాలవైపు ఆలోచించేలా చేస్తుందన్నారు. స్టడీసెంటర్స్లో ఉత్తమ పనితీరుతో పనిచేసిన అధ్యాపకులు(కౌన్సిలర్లు), కోఆర్డినేటర్స్ సేవలను గుర్తించి త్వరలోనే ప్రత్యేక పారితోషికం అదించేలా చర్యలు తీసుకుంటునామన్నారు. బీఆర్ఏఓయూ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ మాట్లాడుతూ హైదరాబాద్లోని యూనివర్సిటీలో ఉన్నప్పటికీ ఈ జిల్లా వాసిగా తన సేవలు ఎప్పుడు అందిస్తామన్నారు. అనంతరం వారిని సన్మానించారు. కార్య క్రమంలోకార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, బద్దం మహేశ్కుమార్, సపావత్ రేఖ్యానాయక్, రమేశ్, సునీత పాటు ఉమ్మడి జిల్లాలోని స్టడీసెంటర్ కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్, కౌన్సిలర్స్(అధ్యాపకులు) పాల్గొన్నారు.
బీఎల్ఐసీకి అనుమతి ఇవ్వాలని వినతి
నల్లగొండలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అమలు చేస్తున్న బీఎల్ఐఎస్సీ(బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్) కోర్సు నిర్వహణ, తరగతులను బోధించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం అధ్యాపకుడు ఎ.దుర్గప్రసాద్ వీసీ ప్రొఫెసర్ సీతారామారావుకు వినతి పత్రం అందజేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

