ప్రలోభాలకు లొంగని వీర మునుగోడు
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసింది. అయినా మునుగోడు మండల ప్రజలు వారికి లొంగకుండా అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్కు అండగా నిలిచి ఆధిక్యతను అందించారు.
మునుగోడు రూరల్, నవంబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసింది. అయినా మునుగోడు మండల ప్రజలు వారికి లొంగకుండా అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్కు అండగా నిలిచి ఆధిక్యతను అందించారు. మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం లభించింది. ఐదు గ్రామాల్లో స్వల్ప ఆధిక్యత వచ్చింది. మండలంలో కాంగ్రెస్ ప్రభావం అంతగా కనిపించలేదు. ఏఒక్క గ్రామంలోనూ ఆ పార్టీకి ఆధిక్యం రాలేదు. ఇటీవల జరిగిన చండూరు సభలో మునుగోడు విజయంతోనే బీఆర్ఎస్కు పునాది పడాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో మండల ప్రజలు ఆయనకు వెన్నంటి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించడం, అందులో మునుగోడు నుంచి మంచి ఆధిక్యం లభించడంతో ప్రజలు సంబురాల్లో మునిగి పోయారు. మునుగోడును వీర మునుగోడుగా సంబోధించుకుంటున్నారు. అదే ఉత్సాహంతో నల్లగొండ నుంచి మునుగోడుకు వెళ్లే రోడ్డుపై ఉన్న బోర్డును వీర మునుగోడుగా మార్చి సంబుర పడ్డారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

