కుకలపై ప్రత్యేక దృష్టి సారించాలి
వీధి కుకల దాడుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘కుకలు భౌ బోయ్' కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాసర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు హాజరయ్యారు.
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదాద్రి భువనగిరి, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : వీధి కుకల దాడుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘కుకలు భౌ బోయ్’ కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాసర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వీధి కుకల బెడద అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కుకల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాటిని బంధించి, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కుకకాటు ద్వారా వ్యాపించే రెబీస్ వ్యాధిని నివారించేందుకు వీధి కుకలకు యాంటీ రెబీస్ టీకాలు వేయాలని ఆదేశించారు. కుకల సంతతిని నియంత్రించేందుకు పెద్దఎత్తున స్టెరిలైజేషన్ (జనన నియంత్రణ) ఆపరేషన్లు చేపట్టాలన్నారు.
ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో వీధి కుకలను గుర్తించి వాటికి స్టెరిలైజేషన్ చేయడం అత్యవసరమన్నారు. ముఖ్యంగా జనాభా ఎకువ ఉండే చోట క్రమం తప్పకుండా డ్రైవ్ నిర్వహించి కుకలకు స్టెరిలైజేషన్ చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ అధికారి సరిత, పశుసంవర్థక శాఖ అధికారి జానయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా వైద్యశాఖ అధికారి మనోహర్, జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

