యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 7: ప్రజలంతా భక్తిభావం అలవర్చుకోవాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వంగపల్లిలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన కానుగు పల్లవీఅనిల్గౌడ్ ఆధ్వర్యంలో పలువురికి డప్పులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కానుగు కవిత, ఉప సర్పంచ్ రేపాక స్వామి, వార్డు సభ్యులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.
కనకదుర్గ విగ్రహాల ప్రతిష్ఠ
ఆత్మకూరు(ఎం) : దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మండల కేంద్రంతోపాటు కొరటికల్, పల్లెర్ల గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. లయన్స్ యూత్ క్లబ్ సభ్యులు రాజు, సురేశ్, ఉదయ్, మురళి, శివ, సోమేశ్, సాయి, మహేశ్, ప్రశాంత్, హరీశ్ పాల్గొన్నారు.
బాలాత్రిపుర సుందరీదేవిగా..
ఆలేరు టౌన్ : పట్టణంలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, గణపతి పూజ, స్వస్తివాచనం, అఖండ దీపారాధన చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి ఆలేటి రంగన్న, బేతి రాములు, కొలుపుల హరినాథ్, రచ్చ అంబదాసు, నీలం వెంకటస్వామి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం : మండల కేంద్రంలో శివ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజలు చేశారు. కట్ట శ్రీకాంత్‌గౌడ్, సర్పంచ్ రాంపల్లి మహేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్, శివ యూత్ అధ్యక్షుడు కేసారం రవి, మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణ, గణేశ్ పాల్గొన్నారు.