ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భువనగిరి మరోమారు జాతీయ స్ఫూర్తిని చాటింది. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఖిలా వరకు 200 మీటర్ల పొడవున్న జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
చౌటుప్పల్, అక్టోబర్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపందుకుని చౌటుప్పల్ మున్సిపల్ యంత్రాంగం పచ్చదనానికి పెద్దపీట వేసింది. జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తున్నది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం శివారు నుంచి లింగోజీగూడెం వరకు 6కి.మీ మేర మొక్కల పెంపకం చేపడుతున్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నాటిన మొక్కలతో చౌటుప్పల్ జాతీయ రహదారికి హరితశోభ చేకూరింది.
రహదారికి హరిత శోభ…
జాతీయ రహదారి వెంట అందంగా, ఆకర్షణీయమైన పచ్చ తురాయి, ఎర్ర తురాయి, కోనో కార్పస్ లాంటి మొక్కలను నాటుతున్నారు. ఇవి వేగంగా, ఏపుగా పెరుగుతాయి. పశు, పక్షాదులు వీటిని తినేందుకు ఇష్టపడవు. అయినప్పటికీ నాటిన ప్రతి మొక్కనూ రక్షించేందుకు ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. జీఎంఆర్ సంస్థ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో ఈమెక్కల సంరక్షణ చేపడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. గజ్వేల్ తరహాలో సుమారు 60వేల మొక్కలు నాటి సంరక్షించేందుకు మున్సిపల్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
వార్డుల్లో ట్రీ పార్కులు…
మున్సిపాలిటీ పరిధిలోని 20వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా ఇప్పటికే లక్షా 57వేల మొక్కలు నాటించారు. ప్రతి వార్డులో 10 నుంచి 20వేల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ట్రీ పార్క్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మద్దెలమ్మ దేవాలయం, అంజనాసాయి మెడోస్, మోడల్ పాఠశాల, మారుతీ పరిశ్రమ పక్కన, తంగడపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయం సమీపంలో మొత్తం 5 ట్రీ పార్క్‌లను ఏర్పాటు చేశారు. స్థలాన్ని బట్టి కనీసం వెయ్యి నుంచి నాలుగు వేల మొక్కలను నాటిస్తున్నారు.
పెద్ద ఎత్తున మొక్కల పెంపకం…
మున్సిపాలిటీ పరిధిలో విరివిగా మొక్కలు నాటిస్తున్నాం. సీఎం కేసీఆర్ మొదలు పెట్టిన హరితహారంలో అందరం భాగస్వామ్యమవుతూ పచ్చదనం పెంపు దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. జాతీయ రహదారికి ఇరువైపులా, మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేశాం.
మున్సిపాలిటీలో 57వేల మొక్కలు
మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా, అన్ని వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపడుతున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వాటిని సంరక్షిస్తున్నాం. ఇప్పటికే 57వేల మొక్కలను నాటించాం.