రామగిరి (నల్లగొండ), జూన్ 07 : పాఠకులకు అర్థమయ్యేలా రచనలు చేయడం హర్షనీయమని జాతీయ ఉత్తమ సినీ విమర్శకులు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలోని సమావేశ మందిరంలో డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య రచించిన నెరుసు, మెర విమర్శ గ్రంథాల ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సాహిత్యంలో విమర్శ అనే ప్రక్రియ అత్యంత కీలకమైనదని, సాహిత్యం పురోగమించడానికి విమర్శ ఉపకరిస్తుందని తెలిపారు. అనంతరం పురుషోత్తమాచార్య మాట్లాడుతూ.. రచన సారాన్ని పాఠకులకు అందించడంలో విమర్శ ఎంతగానో తోడ్పడుతుంన్నారు. మెర పుస్తక ఆవిష్కరణ మేరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ..నిత్య అధ్యయనశీలియైన కృష్ణ కౌండిన్య పరిశోధనాత్మక దృష్టితో వ్యాసాలు రచించారన్నారు.
సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయవలసిన బాధ్యత సాహిత్య కారులపై ఉందని ప్రముఖ కవి విమర్శకులు డా. పగడాల నాగేందర్ అన్నారు. ఆయా కవులు రాసిన పలు పుస్తకాలను సద్విమర్శ గావించి తనదైన శైలిలో ఆవిష్కరించిన విధానం బాగుందని మునాసు వెంకట్ కొనియాడారు. ప్రాచుర్యం పొందిన వారితో పాటు, వెలుగులోకి వస్తున్న రచయితల్ని, వాళ్ల రచనల్ని పొదువుకున్న ఈ వ్యాస సంపుటాలు రాబోయే కాలంలో సాహిత్య పరిశోధకులకు ఉపయుక్త గ్రంథాలుగా నిలుస్తాయని ఎన్వీ రఘువీర్ ప్రతాప్ అభిప్రాయపడ్డారు. నెరుసు వ్యాసాలను శీలం భద్రయ్య, మేర వ్యాసాలను డాక్టర్ సాగర్ల సత్తయ్య సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మాదగాని శంకరయ్య, బైరెడ్డి కృష్ణారెడ్డి, కత్తుల శంకర్, డాక్టర్ కనకటి రామకృష్ణ, ధనోజ, డా.రావిరాల అంజయ్య, బి.శ్రవణ్, పేరుమల్ల ఆనంద్, రమేశ్, బండారు శంకర్, సిలివేరు లింగమూర్తి పాల్గొన్నారు.