దేవరకొండ రూరల్, జూలై 15 : ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని దేవరకొండ గిరిజన కాలేజీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్కిల్ డెవలప్మెంట్పై వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాజానికి యువ శక్తి ఎంతో అవసరమన్నారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, కావునా యువత సరైన మార్గంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేరా భారత్ ఆర్గనైజర్ కొండల్, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిశోర్, చక్రపాణి, రాము, శ్యామల, మీనేశ్వరి, స్వాతి పాల్గొన్నారు.