వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
నల్లగొండ నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి ప్రాజెక్టును మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత స్కై వాక్, కమర్షియల్ కాంప్లెక్స్...
నీలగిరి, అక్టోబర్ 12 : నల్లగొండ నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి ప్రాజెక్టును మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత స్కై వాక్, కమర్షియల్ కాంప్లెక్స్, అర్బన్ ప్లాజా, రీచార్జ్ వెల్స్ తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. నగర అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యతపై చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, భూసంబంధిత అంశాలు, ప్రజాభిప్రాయ సేకరణ, నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై వరల్డ్ బ్యాంక్ బృందం పలు సూచనలు చేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ అబ్బగోని రమేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.మనోహర, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.అశోక్ కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ వి.దిలీప్ భార్గవ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

