హాలియా, సెప్టెంబర్ 15 : హాలియా మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. హాలియా మున్సిపాలిటీకి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సౌజన్యంతో రూ. 21 లక్షల విలువ చేసే వైకుంఠ రథం సమకూరగా గురువారం దానిని ఎమ్మెల్యే మున్సిపాలిటీకి అందజేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి రెయిన్కోర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది కాలంలో రూ. 30 కోట్లతో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. దశల వారీగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకయర్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కమిషనర్ వీరారెడ్డి, కౌన్సిలర్లు వర్రా వెంకట్‌రెడ్డి, అన్నెపాక శ్రీను, ప్రసాద్‌నాయక్, నల్లబోతు వెంకటయ్య, కోప్షన్ సభ్యులు చాపల సైదులు, డోమినిక్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, నాయకులు రావుల లింగయ్య, అన్వరుద్దిన్, నాయకులు రావిళ్ల చెన్నయ్య, సురభిరాంబాబు, బందిలి సైదులు పాల్గొన్నారు.
హాలియా : క్రీడలతో యువత మధ్య స్నేహభావం పెంపొందుతుందని ఎమెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. గురువారం హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి వారిని ఉత్సాహ పర్చారు. తెలంగాణ ఉద్యమకారులు వడ్డే సతీశ్‌రెడ్డి, గడ్డం సోము, గోపిశెట్టి నర్సింహ, గుంటుక మధుసూదన్‌రెడ్డి, రావులపాటి ఎల్లయ్య, యడవల్లి రాంబాబు, షేక్ జావెద్ పాల్గొన్నారు.