కట్టంగూర్, జులై 09 : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని డీపీఎం మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం హహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా పాఠశాల భవనాల నిర్మాణం, గ్యాస్ సబ్సిడీ, మహిళా క్యాంటీన్స్, పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు వంటి పథకాలను అందిస్తుందని తెలిపారు.
సంఘాల్లో లేని మహిళలను సంఘాల్లో చేర్పించాలన్నారు. 60 సంవత్సరాలు పైబడిన మహిళలకు ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కస్ఫరాజు సైదులు, సీసీలు కాడింగ్ శంకర్, జిల్లా వెంకన్న, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు అయితగోని ఝాన్సీ, తండు రేణుక, కోశాధికారి గద్దపాటి రేణుక, మాజీ అధ్యక్షురాలు తాటిపాముల చైతన్య. గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.