తుంగతుర్తి, ఏప్రిల్ 10 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో మహిళలు ఖాళీ సిలిండర్లతో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతుందన్నారు. బేషరతుగా పెంచిన ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇస్తామన్న గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గుండగాని రాములుగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న, నాయకులు తెడ్డు హరిబాబు, గోపగాని రమేశ్, దూదిగాని లింగయ్య, నాలి మురళి, తాళ్లపల్లి యాకయ్య, సమ్మడ పాషా, చిట్టీ, సాలయ్య, నగేశ్, మహిళలు పాల్గొన్నారు.