భువనగిరి కలెక్టరేట్, మార్చి 4 : వేసవికి ముందే తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలోని పెద్దమ్మ కాలనీకి వారం రోజులుగా తాగునీటి సరఫరా సరిగ్గా ఉండడం లేదు. అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో మంగళవారం సాయంత్రం మహిళలు ఖాళీ బిందెలు, బకెట్లు, నీళ్ల క్యాన్లతో భువనగిరి-గజ్వేల్ హైవేపై ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి స్పందించి తాగు నీటి సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వచ్చి ఎంపీడీఓ సీహెచ్ శ్రీనివాసరావుతో హామీ ఇప్పించి ఆందోళన విరమించారు.