ఆలేరు టౌన్, మే 31 : జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆలేరులోని పాలశీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడా రు. ఎన్నో పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేస్తూ ఘనం గా నివాళులర్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర సాధనకు సుదీర్ఘ పోరాటం చేశారని, చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు.
ఆం ధ్ర పాలకులతో నష్టపోయిన తెలంగాణ పదేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు,తాగునీరు అం దించిన పితామహుడు కేసీఆర్ అని కొనియాడా రు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎలా అయితే సంబురాలు జరుపుకున్నామో, అదేమాదిరిగా సోమవారం జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబురాలు జరుపుకోవాలన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. కార్యక్రమంలో గుట్ట మండలాధ్యక్షుడు వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌గౌడ్, మండలా ధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, నాగరాజు, రాంరెడ్డి, హరినాథ్, పాండరి, లక్ష్మీప్ర సాద్‌రెడ్డి, కిష్టయ్య, నర్సింహులు, నరసయ్య, ఉప్పలయ్య, సంపత్, ఫయాజ్, కృష్ణ, పాల్గొన్నారు.