– ఐదు నెలలు కావస్తున్నా పూర్తికాని రోడ్డు పనులు
– కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
– పట్టించుకోని ఎమ్మెల్యే, ఆర్ అండ్ బి అధికారులు
తుంగతుర్తి, జనవరి 10 : తుంగతుర్తి నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి మహాత్మా గాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు ఉన్న మెయిన్ రోడ్డు పనులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని తుంగతుర్తి ప్రజానీకం వేచి చూస్తున్నారు. సీసీ రోడ్డు నిర్మిస్తామని పాత రోడ్డును తవ్వి కంకర, డస్ట్ పోసి ఐదు నెలలు కావస్తున్నా కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వాహనాలు ప్రయత్నిస్తున్న సమయంలో గాలికి దుబ్బ లేవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్ పై వెళ్తూ అదుపుతప్పి కింద పడడంతో గాయపడ్డాడు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, ఆర్ అండ్ బి అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.