భూదాన్‌పోచంపల్లి: ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం పోచంపల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 51 మందికి కల్యాణలక్ష్మి, ముగ్గురికి షాదీ ముభారక్ చెక్కులను అందజేశారు.
అదేవిధంగా చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అందించే చేనేతబంధు పథకం కింద ఎంపికైన ఆరు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, తహసీల్దారు దశరథ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, సిగింల్విండో చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.