భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్‌చైర్మన్ ధనావత్ బీకూనాయక్ అన్నారు. గురువారం భువనగిరిలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వ్యవసాయ స్థాయి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన క్రషర్లపై నిఘా పెంచాలన్నారు.
సమావేశంలో జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు. పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఎం గోపీకృష్ణ, మైన్స్ ఏడీ వెంకటరమణ, మార్కెటింగ్ డీఎం సబిత, అటవీ శాఖ అధికారి పద్మజారాణి, వ్యవసాయ శాఖ అధికారి అనూరాధ, సహకార శాఖ అధికారి పరిమళాదేవి, ఉద్యానవన శాఖ అధికారి అన్నపూర్ణ, పశు సంవర్ధక శాఖ అధికారి కృష్ణ, భూగర్భ జల శాఖ డీడీ జ్యోతికుమార్ పాల్గొన్నారు.