దేవరకొండ రూరల్, జూన్ 18 : భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు, అలాగే పెండ్లిపాకల ఓపెన్ కెనాల్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహారం చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు చెక్కులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గుడిపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామానికి చెందిన రైతులు ఏకేబీఆర్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన 12 మందికి రూ.68 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా పీఏ పల్లి మండలంలోని బాలాజీనగర్ గ్రామానికి చెందిన రైతులు ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కెనాల్ ద్వారా భూములు కోల్పోయిన 45 మందికి రూ.11.6 కోట్ల విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే పీఏ పల్లి, గుడిపల్లి మండలం సస్యశ్యామలం అవుతాయన్నారు.
చిలకమర్రి, బాలాజీనగర్ గ్రామానికి చెందిన 57 కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, పరిహారం అందని వారు బాధ పడాల్సిన అవసరం లేదని, మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, ఆర్డీఓ రమణా రెడ్డి, ఈఈ డివిజన్-5 కేతావత్ నెహ్రూ నాయక్, ఏకేబీఆర్ డివిజన్-4 డీఈ నాగయ్య, రమేశ్, ఏఈలు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Devarakonda : భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్