కోదాడ, ఆగస్టు 20 : అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెంచుతామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బచ్చలకూరి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కోదాడ పట్టణం ఎమ్మెస్ కళాశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న నిర్వహించనున్న సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిక హాజరు కానున్నట్లు తెలిపారు. పింఛన్లు పెంచే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఏపూరి రాజు, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.