నిడమనూరు, జూన్ 21 : పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. శనివారం మండలంలోని బంకాపురం, వెనిగండ్ల, వెంగన్నగూడెం, గుంటుగూడెం, ముప్పారం, సోమోరిగూడెం గ్రామాల్లో ఎంపీడీఓ గుర్రం వెంకటేశంతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.
ప్రభుత్వ సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఇందిరమ్మ పక్కా ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్ విజయ్ కుమార్, ఉన్నం సత్యనారాయణ, ఉన్నం పెద్ద వెంకటేశ్వర్లు, గుండా లింగయ్య, చరక శ్రీను, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, కొండారు చంద్రశేఖర్ పాల్గొన్నారు.