కోదాడ, నవంబర్ 14 : విద్యార్థి దశలోనే దేశభక్తిని ఇనుమడింపజేసుకుని భవిష్యత్లోఉత్తమ పౌరులుగా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ పుల్లూరి వెంకటనారాయణ అన్నారు. శుక్రవారం కోదాడలోని పాఠశాలలో తొలి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ ప్రధాని చాచా నెహ్రూకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ఇన్చార్జి గోవర్ధన్ రాయుడు, ఉపాధ్యాయులు కన్నయ్య, రవీంద్ర నాయక్, విజయ్, దుర్గాప్రసాద్, సుజాత, బ్రాహ్మణి, శాంతకుమారి, రెహనా, వెంకట్రెడ్డి, రాజేశ్వరి, విద్యార్థినులు పాల్గొన్నారు.