పెన్పహాడ్, సెప్టెంబర్ 08 : కోహన్స్ లైఫ్ సైన్స్ యడవెల్లి అఖిల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని పోట్లపహాడ్ గ్రామంలో వాటర్ ప్లాంట్ను సోమవారం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థల దాత ఎగ్గడి సత్యమయ్య, నీలమ్మ, డాక్టర్ రామ్మూర్తి, రాజేశ్ ముదిరెడ్డి, ఉపేందర్, మేకపోతుల సుందర్, యాదగిరి, సురేశ్, సలీం, షకీల్, సిద్దు, ఇక్బాల్ పాల్గొన్నారు.