నల్లగొండ, ఫిబ్రవరి 11 : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. నల్లగొండలోని 30వ డివిజన్ పోలింగ్ బూత్‌లో దొంగ ఓటు కలకలం రేపింది. డివిజన్లోని ఓటరు నిశాంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. అయితే ఆయన పేర ఓ దొంగ ఆధార్ కార్డు సృష్టించి ఓటు వేసేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. ఫేక్ ఆధార్ కార్డుతో ఓటు వేయబోయిన దొంగ ఓటరును బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి జహంగీర్ గుర్తించి అడ్డుకున్నాడు. వెంటనే పట్టుకుని ఆ దొంగ ఓటరును పోలీసులకు అప్పజెప్పాడు. కాగా నువ్వెలా దొంగ ఓటరు అవుతావంటూ సదరు వ్యక్తిని పోలీసులు వదిలేసినట్లు ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ పోలీసులు విధులు నిర్వహించారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.