కట్టంగూర్ : ఈనెల 28న నల్లగొండలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే పూలే, అంబేద్కర్ జన జాతరను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంటెపాక కృష్ణ పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్లోని అమరవీరుల స్మారక భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జన జాతర కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. మహనీయులు ఎదుర్కొన్న కుల వివక్షతలే వారిని శక్తివంతులుగా తయారు చేశాయన్నారు.
అవమానాలు ఎదుర్కొన్న చోటనే హక్కులను సాధించుకోవాలనే సంకల్పంతో అంతరాలకు కారణమైన మూలాలను తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కట్ట బక్కయ్య, చిలుముల రామస్వామి, రమేష్, కిరణ్, ఎల్లయ్య, మధు, సుధాకర్, మల్లేష్, సుహాస్ తదితరులు పాల్గొన్నారు.